![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -33 లో.....గంగని మా ఇంటికి తీసుకొని వెళ్తాను. మాతోనే ఉంటుందని శకుంతల అంటుంది. పెద్దమ్మ మీ నిర్ణయానికి అడ్డు చెప్పను కానీ ఒకసారి ఆలోచించండి అందరు మన కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తారని రుద్ర అంటడు. దాంతో అతనికి సమాధానం శకుంతల కొంచెం కఠినంగానే చెప్తుంది. దాంతో రుద్ర సైలెంట్ గా ఉంటాడు. గంగ ని తీసుకొని అందరు బయల్దేరతారు.
మరొకవైపు ఇషిక, వీరు ఇద్దరు ఒక కార్ లో వస్తారు. ఇషిక, ఇందుమతి కి ఫోన్ చేసి ఆ గంగని ఇంటికి తీసుకొని వస్తున్నారు.. అలా అయితే మన కుటుంబం పరువు ఏమవుతుంది అందరు వద్దని చెప్పండి అని ఇషిక చెప్తుంది. ఆ తర్వాత నేనున్నాను కదా బ్రో డోంట్ వర్రీ అని వీరుతో ఇషిక అంటుంది ఇదేంటి నేను ఫ్యామిలీనే నాశనం చెయ్యాలని చూస్తున్నా ఇదేమో వాళ్ళని విడగొట్టాలని చూస్తుంది పిచ్చిది అని వీరు అనుకుంటాడు. నీ ప్లాన్ నీకుంటే నా ప్లాన్ నాకుంది బ్రో.. ఇంటిని నా గుప్పిట్లో పెట్టుకోవాలని ఇషిక అనుకుంటుంది. మరొకవైపు ఇందుమతి ఇంట్లో అందరిని పిలిచి గంగని అక్క ఇంటికి తీసుకొని వస్తుందట మనం వద్దని చెప్పాలని ఇంట్లో అందరిని రెచ్చగొడుతుంది.
అప్పుడే గంగని తీసుకొని శకుంతల ఇంటికి వస్తుంది. గంగని తీసుకొని రాకుంటే బాగుండు అని ఇందుమతి అంటుంది. ఇప్పుడు తీసుకొని వస్తే వచ్చిన సమస్య ఏంటని శకుంతల అంటుంది. ఇకపై గంగ ఇక్కడే ఉంటుందని శకుంతల అంటుంది. తరువాయి భాగంలో గంగ ఇక్కడే ఉంటుంది. ఎవరికైనా ప్రాబ్లమ్ అయితే చెప్పండి అందరం విడిపోదామని శకుంతల అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |